తెలంగాణపై ఎల్‌నినో ఎఫెక్ట్.. నీటి నిల్వలు భారీగా తగ్గాయి: మంత్రి ఉత్తమ్ కుమార్
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:32 PM
తెలంగాణ ప్రజల ముందున్న ఎల్‌నినో సమస్యను అత్యంత తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎన్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై లఘు చర్చ మొదలైంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణ ప్రజల ముందున్న ఎల్‌నినో సమస్యను అత్యంత తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎన్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై లఘు చర్చ మొదలైంది. మంత్రి ఉత్తమ్ చర్చను ప్రారంభించి ప్రసంగించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, వర్షాల మధ్య విరామాలు పెరగడం జరుగుతోందన్నారు. దీని ప్రభావంతో జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు తగ్గుతున్నాయని తెలిపారు. రైతుల పంటలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ప్రజల తాగునీటి భద్రతపై ఒకేసారి ఒత్తిడి ఏర్పడుతోందన్నారు.
ముఖ్యంగా విత్తనాలు వేసే కీలక సమయంలో వర్షం పడకపోవడం రైతుకు ప్రకృతి సమస్య మాత్రమే కాదని.. రైతు పెట్టుబడి, అప్పులు, కుటుంబ భవిష్యత్తుతో ముడిపడిన జీవన్మరణ సమస్య అని మంత్రి చెప్పుకొచ్చారు. అందుకే ఈ అంశంపై రాజకీయ ఆరోపణలు కాకుండా.. వాస్తవ గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలతో చర్చ జరగాలని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. గత ఏడాది ఇదే సమయానికి కృష్ణా బేసిన్‌లోని మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల లైవ్ స్టోరేజ్ సుమారు 333 టీఎంసీలు ఉందని.. ఈ ఏడాది అదే సమయానికి లైవ్ స్టోరేజ్ సుమారు 160 టీఎంసీలకు పడిపోయిందన్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే భారీగా నీటి నిల్వ తగ్గిందని తెలిపారు. ఈ పరిస్థితి రైతుల సాగునీటితో పాటు తాగునీటి భద్రతపైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో తాగునీరు, సాగునీరు, విద్యుత్ అవసరాలను సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
కేసులకు భయపడం.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
జగన్నాటకంతో ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై మహేశ్వర్ రెడ్డి ఫైర్
Read Latest Telangana News And Telugu News