Share News

కేసులకు భయపడం.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్

ABN , Publish Date - Sep 18 , 2026 | 11:43 AM

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే అందులో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

కేసులకు భయపడం.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
Former Minister KTR

హైదరాబాద్, సెప్టెంబర్ 18: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే అందులో అవినీతి జరిగిందని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈరోజు(శుక్రవారం) నాంపల్లి ఏసీబీ కోర్టు వద్ద ఆయన మాట్లాడుతూ.. కేసులకు భయపడేది లేదని.. న్యాయవ్యవస్థలపై అపారమైన నమ్మకం ఉందన్నారు. పోలీసులు ఎంత వేధించినా ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయవ్యవస్థ తమకు వెన్నుదన్నుగా ఉందని చెప్పారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.


తమిళనాడు సీఎం విజయ్ ఫార్ములా ఈ రేస్ కోసం లండన్ వెళ్లారని మాజీ మంత్రి అన్నారు. పక్క రాష్ట్రాలు బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం లండన్ వెళ్తుంటే ఇక్కడ తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. టార్గెట్ కేసీఆర్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. లక్ష కోట్లు సంపాదించామని కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అసత్య ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు. ‘రూ.1000 కోట్లు ఇచ్చి మా పేరుపై ఉన్న లక్ష కోట్ల ఆస్తులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నాం. రూ.99 వేల కోట్లతో మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

అసెంబ్లీలో ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రస్తావన

ఫార్ములా ఈ కేసు.. నాంపల్లి ఏసీబీ కోర్టుకు కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 18 , 2026 | 12:23 PM