తప్పు చేస్తే సొంత అధికారిపైనా చర్యలు తీసుకుంటాం: తెలంగాణ ఏసీబీ
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:21 PM
తెలంగాణ ఏసీబీ అధికారిపై మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ చేసిన ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులు స్పందించారు. ఏసీబీలో అవినీతికి జీరో టాలరెన్స్ అని స్పష్టం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 25: తెలంగాణ ఏసీబీ అధికారిపై మాజీ విద్యుత్ ఏడీఈ అంబేద్కర్ చేసిన ఆరోపణలపై ఏసీబీ ఉన్నతాధికారులు స్పందించారు. ఏసీబీలో అవినీతికి జీరో టాలరెన్స్ అని స్పష్టం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, సొంత శాఖ అధికారులైనా తప్పు చేసినట్లు నిరూపితమైతే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు అధికారిపై మాజీ ఏడీఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదును నిష్పక్షపాతంగా పరిశీలించి శాఖాపరమైన విచారణ జరుపుతామని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత అధికారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఫిర్యాదుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఫిర్యాదుదారుడికి ఇప్పటికే మూడుసార్లు విచారణకు హాజరుకావాలని అధికారులు పిలిచినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి...
హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలాన్ని వెంటనే రద్దు చేయాలి: కేటీఆర్
Read Latest Telangana News And Telugu News