Share News

ఢిల్లీ ర్యాలీకి రాని యువజన కాంగ్రెస్‌ నేతలపై వేటు

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:46 AM

‘ఓట్‌ బచావో- దేశ్‌ బచావో’ నినాదంతో ఢిల్లీలో ఇండి కూటమి నిర్వహించిన ప్రదర్శనకు హాజరు కాని 14 మంది రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నేతలపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి మంగళవారం తెలిపారు.

ఢిల్లీ ర్యాలీకి రాని యువజన కాంగ్రెస్‌ నేతలపై వేటు
Vote Bachao Desh Bachao Rally

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘ఓట్‌ బచావో- దేశ్‌ బచావో’ నినాదంతో ఢిల్లీలో ఇండి కూటమి నిర్వహించిన ప్రదర్శనకు హాజరు కాని 14 మంది రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ నేతలపై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ ప్రదర్శనకు నేతలంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఏఐసీసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రదర్శనకు రాని ఆరుగురు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు రాష్ట్ర కార్యదర్శులు, హైదరాబాద్‌ అధ్యక్షుడిని సస్పెండ్‌ చేశామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:46 AM