మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
ABN , Publish Date - Nov 03 , 2026 | 06:29 AM
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్‌శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు.
మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే కాంగ్రెస్ సర్కారు లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్‌శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. అందుకు వారి వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు దక్కేలా సహకరిస్తామన్నారు. డిసెంబరు 7-9 తేదీల మధ్య భారత్ ఫ్యూచర్ సిటీలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ చేపట్టనున్న నేపథ్యంలో సచివాలయంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో పట్టణాలతోపాటు గ్రామాల్లోనూ.. స్వయం సహాయక సంఘాల నెట్‌వర్క్‌ల ద్వారా మహిళలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికతను సంక్షేమ కోణంలోనే చూడకుండా రాష్ట్ర ఆర్థిక బలాన్ని పెంపొందించే కీలక రంగంగా గుర్తించాలన్న సీతక్క.. ‘వీ-హబ్’ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యమంలోకి వెళ్లి జీవితం పాడు చేసుకున్నా!
అమిత్‌షా పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
సందిగ్ధతకు తావు లేకుండా ఎస్సీ వర్గీకరణ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News