Share News

రాష్ట్రంలో వీబీజీరామ్‌జీ అమలు భేష్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:48 AM

తెలంగాణలో వీబీజీరామ్‌జీ పథకం అమలు తీరును కేంద్ర గ్రామీణాభివృద్థి, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశంసించారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆయన గురువారం లేఖ రాశారు.

రాష్ట్రంలో వీబీజీరామ్‌జీ అమలు భేష్‌
Telangana VBG RAM G Scheme

  • 2026-27 కి.. రూ.3,825.3 కోట్లు కేటాయింపు

  • మంత్రి సీతక్కకు లేఖరాసిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వీబీజీరామ్‌జీ పథకం అమలు తీరును కేంద్ర గ్రామీణాభివృద్థి, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రశంసించారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆయన గురువారం లేఖ రాశారు. వీబీజీరామ్‌జీ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన పలు సూచనలపై స్పందిస్తూ ఆయన ఈ లేఖ రాశారు. వీబీజీరామ్‌జీ పథకం కింద తెలంగాణలో ఇప్పటివరకు 1.83 కోట్ల పనిదినాలు కల్పించారని, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనులు చేపట్టడాన్ని కేంద్ర మంత్రి అభినందించారు.


గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడంతోపాటు చట్టంలోని నిబంధనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధత ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.3,825.3 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు పనులను పరిశీలించి వీబీజీరామ్‌జీ కింద అనుమతించదగిన పనుల జాబితాను 375 పనులకు విస్తరించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన రాష్ట్ర గృహ నిర్మాణ పథకంతోపాటు, రాష్ట్రం సూచించిన పలు పనులను ఈ జాబితాలో చేర్చినట్లు కేంద్ర మంత్రి తన లేఖలో వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:48 AM