రాష్ట్రానికి మరో రూ.3,892 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్
ABN , Publish Date - Nov 05 , 2026 | 05:28 AM
అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
5 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
హైదరాబాద్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐదు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా రూ.3,892 కోట్లు! ఇందులో రూ.873.49 కోట్లు కేంద్రం విడుదల చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి తెలిపారు. తాజా ప్రాజెక్టులతో తెలంగాణ అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ఆమోదం పొందిన ప్రాజెక్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది. వీటి మొత్తం విలువ రూ.9,573.42 కోట్లని, ఈ మొత్తంలో కేంద్రం నుంచి అందనున్న సాయం రూ.2,293.75 కోట్లు అని తెలిపారు. గతంలో జరిగిన తొలి నాక్ సమావేశంలో రూ.5,681.04 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కండక్టర్ ప్రవళికకు కన్నీటి వీడ్కోలు
స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్ ఎన్‌వోసీ!
7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా
Read Latest Telangana News And AP News And National News
And Telugu News