Share News

‘గిరిజన’ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:39 AM

గిరిజన సలహా మండలి (టీఏసీ) సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కోరారు.

‘గిరిజన’ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
Vidya Sagar Rao

  • గవర్నర్‌కు బీజేపీ సీనియర్‌ నేత విద్యాసాగర్‌రావు విజ్ఞప్తి

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): గిరిజన సలహా మండలి (టీఏసీ) సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కోరారు. ఏకలవ్య ఫౌండేషన్‌ నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డితో కలిసి విద్యాసాగర్‌రావు శుక్రవారం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.


దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల అమలు, షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో భూ వివాదాలు- పరిష్కారం, భూ పంపిణీ ప్రక్రియ వేగవంతం, గిరిజనులకు అసైన్డ్‌ భూముల కేటాయింపు వంటి కీలక అంశాలపై చర్చించి పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పథకాల అమలు పక్కాగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బోధనాస్పత్రుల్లో వెల్‌నెస్‌ కేంద్రాలు
సీఎంఆర్‌ ధాన్యం దారిమళ్లింపు.. మిల్లు భాగస్వాములపై కేసు!

స్వచ్ఛంద సమాచార వెల్లడితో.. ఆర్టీఐ దరఖాస్తుల భారం తగ్గుతుంది!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 06:40 AM