బోధనాస్పత్రుల్లో వెల్‌నెస్ కేంద్రాలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:36 AM
నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఎన్‌ఈహెచ్‌ఎ్‌స)లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వారి జిల్లాల్లోనే ఓపీ సేవలందించాలని సర్కారు నిర్ణయించింది.
హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఎన్‌ఈహెచ్‌ఎ్‌స)లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వారి జిల్లాల్లోనే ఓపీ సేవలందించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాల్లోని బోధనాస్పత్రుల్లో వెల్‌నెస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 25 వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. ఈ కేంద్రాలన్నీ కూడా ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల ప్రాంగణాల్లో ఉండబోతున్నాయి. వీటితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్ కేంద్రాల సంఖ్య 37కు పెరగనుంది.
కొత్త కేంద్రాలు అందుబాటులోకి వస్తే ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు హైదరాబాద్ దాకా రావాల్సిన అవసరం ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారికి జిల్లా కేంద్రాల్లోనే ఉచితంగా ఓపీ సేవలతో పాటు డాక్టర్ల కన్సల్టేషన్, మందులు, టెస్టులు అందుతాయి. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరిలోని కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా పరిధిలో వనస్థలిపురంతో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట కేంద్రాల్లోని ఆస్పత్రుల పరిధిలో ఇవి పనిచేస్తున్నాయి. మిగిలిన 21 జిల్లాల్లోని జీజీహెచ్‌లలో కొత్తగా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రధాన ఆసుపత్రుల్లో మరో నాలుగు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
పనిచేసి ఫలితం చూపించినవారికే ప్రజాదరణ
సీఎంఆర్ ధాన్యం దారిమళ్లింపు.. మిల్లు భాగస్వాములపై కేసు!
స్వచ్ఛంద సమాచార వెల్లడితో.. ఆర్టీఐ దరఖాస్తుల భారం తగ్గుతుంది!
Read Latest AP News And Telangana News And International News And Telugu News