Share News

జనవరిలో 4 క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ యూనిట్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 06:38 AM

రాష్ట్రంలో జనవరి నాటికి నాలుగు కొత్త మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

జనవరిలో 4 క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ యూనిట్లు
Damodar Rajanarasimha

  • అన్ని జిల్లాలకు క్యాన్సర్‌ వైద్య సేవలు: మంత్రి దామోదర

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనవరి నాటికి నాలుగు కొత్త మొబైల్‌ క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ యూనిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. హైదరాబాద్‌కే పరిమితమైన క్యాన్సర్‌ వైద్య సేవలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ విస్తరించామని, డే కేర్‌ క్యాన్సర్‌ సెంటర్ల ద్వారా కీమో థెరపీ సేవలు అందిస్తున్నామన్నారు. రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని మంత్రి వెల్లడించారు.


మంగళవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రులో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై సమీక్ష చేశారు. ఎంఎన్‌జే, నిమ్స్‌ ఆస్పత్రుల్లో క్యాన్సర్‌ పేషెంట్లకు అందిస్తున్న వైద్య ేసవలను మంత్రికి అధికారులు వివరించారు. జిల్లాల్లో కీమోథెరపీ ేసవలు పొందుతున్న పేషెంట్ల సంఖ్యను మరింత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. క్యాన్సర్‌ ప్రివెన్షన్‌, స్ర్కీనింగ్‌, ట్రీట్‌మెంట్‌ విషయంలో ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలపై డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు సంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తే ‘అడిగినంత’ జీతం

కోట్లకొద్దీ నకిలీ నోట్లు!

ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 06:38 AM