టీజీఎంఎస్ఐడీసీ జీఎంపై వేటు
ABN , Publish Date - Oct 27 , 2026 | 06:10 AM
తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) జనరల్ మేనేజర్‌పై సర్కారు వేటు వేసింది.
సంస్థ ఎండీ గౌరవ్ ఉప్పల్ ఆదేశం
టెండర్లలో అవకతవకలకు పాల్పడటమే కారణమా?
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) జనరల్ మేనేజర్‌పై సర్కారు వేటు వేసింది. ఆయనను వెంటనే రిలీవ్ చేయాలని కార్పొరేషన్ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆదేశించారు. జీఎంగా పని చేస్తున్న ఆ అధికారిపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులందాయి. టెండర్లలో అవకతవకలు పాల్పడడంతోపాటు, పర్చేజ్ ఆర్డర్ల (పీవో) విలువ ఆఽధారంగా కమీషన్లు తీసుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కార్పొరేషన్ పిలిచిన టెండరులో ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, ఆ కంపెనీయే టెండరును దక్కించుకుందని వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో వైద్య ఉపకరణాలను వాడే విభాగాధిపతులు తమకు ఎలాంటి వస్తువు కావాలో స్పెసిఫికేషన్స్‌తో కార్పొరేషన్‌కు ఇండెంట్ పెడతారు.
ఆ విభాగాధిపతి ఆధ్వర్యంలోని టెక్నికల్ ఎవాల్యూషన్ కమిటీ ఆ స్పెసిఫికేషన్‌ను ఖరారు చేస్తుంది. దాని ఆధారంగా టీజీఎంఎ్‌సఐడీసీ టెండర్లను ఆహ్వానిస్తుంది. అయితే, ఇటీవల ఇద్దరు విభాగాధిపతులు ఒకే ఉపకరణానికి ఇండెంట్ పెట్టారు. వారు వినియోగించదలిచిన ఉపకరణం ఒకటే అయినా.. స్పెసిఫికేషన్స్ మాత్రం వేర్వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, కార్పొరేషన్ జీఎం మాత్రం ఒకే రకమైన స్పెసిఫికేషన్స్ ఉన్న ఉపకరణాన్ని ఓకే చేసినట్లు సమాచారం. తద్వారా, తమకు కావాల్సిన సంస్థకు టెండరు దక్కేలాచేశారన్న ఆరోపణలు వినిపించాయి.
ఈవ్యవహారం వెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు కార్పొరేషన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇక, ఆ ఉపకరణానికి టెండరు పెట్టిన ఓ విభాగాధిపతి.. తాము వినియోగించదలచిన వస్తువు స్పెసిఫికేషన్స్ వేరేలా ఉన్నాయని, వాటిని ఎలా మారుస్తారని సంస్థ ఎండీ గౌరవ్ ఉప్పల్‌కు లేఖరాశారు. ఆ ఉప కరణం తమకు వద్దని కరాఖండీగా తేల్చిచెప్పారు. ఈవిషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాఽధికారులు చాలా తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. దాంతో, జీఎంను వెంటనే తప్పించాలని, మాతృసంస్థకు పంపాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దేవాదాయ శాఖలో అక్రమాలపై.. విజిలెన్స్ నివేదికలు బుట్టదాఖలు
ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్ల నిరాసక్తి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News