Share News

టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:23 AM

ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండాలనే హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-25ను వెంటనే సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించాలి
TPTF

  • టీపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ డిమాండ్‌

హైదరాబాద్‌, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉండాలనే హేతుబద్ధీకరణ ఉత్తర్వులు-25ను వెంటనే సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక టీచర్‌ను కేటాయించాలని రాష్ట్ర అధ్యక్షులు చకినాల అనిల్‌ కుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి పేర్కొన్నారు.


టీపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీచర్లను తరగతి గదికి దూరం చేసే విధంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ కార్యక్రమాలను, ఇబ్బడి ముబ్బడిగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను రద్దు చేయాలని కోరారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని, ఫిట్మెంట్‌ ప్రకటించి అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 06:23 AM