మళ్లీ బార్లపై స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు
ABN , Publish Date - Nov 14 , 2026 | 06:36 AM
బార్ అండ్ రెస్టారెంట్‌ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలు చేసేందుకు అక్టోబర్ 19న ఎక్సైజ్‌శాఖ జారీచేసిన జీవో 205 శుక్రవారం నుంచి మళ్లీ అమలులోకి వచ్చింది.
అమల్లోకి జీవో 205.. సింగిల్ జడ్జి
ఇచ్చిన స్టేను కొట్టేసిన డివిజన్ బెంచ్
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): బార్ అండ్ రెస్టారెంట్‌ల నుంచి స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలు చేసేందుకు అక్టోబర్ 19న ఎక్సైజ్‌శాఖ జారీచేసిన జీవో 205 శుక్రవారం నుంచి మళ్లీ అమలులోకి వచ్చింది. ఈ జీవోపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఈ అంశంపై మళ్లీ విచారణ చేపట్టి తాజాగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ సింగిల్ జడ్జికి కేసును తిప్పిపంపింది. బార్ అండ్ రెస్టారెంట్లపై స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలు బార్ల యజమానులు తొలుత హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జీవో అమలును నాలుగువారాలపాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.
స్టే ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎక్సైజ్ శాఖ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. దానిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శాం కోషీ, జస్టిస్ చలపతిరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. భవిష్యత్తులో ప్రభుత్వం విధించబోయే ఫీజులు తప్పనిసరిగా చెల్లిస్తామని అండర్‌టేకింగ్ ఇచ్చిన తర్వాతే బార్ లైసెన్స్‌లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. బార్ అండ్ రెస్టారెంట్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. సంవత్సరం మధ్యలో మళ్లీ స్పెషల్ ఫీజు ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బ వాదనలు విన్న ధర్మాసనం.. సాధారణ వైన్‌షా్‌పల ధరలకు మీరు మద్యం అమ్మడం లేదు కదా? చాలా ఎక్కువ రేట్లకు విక్రయిస్తారు కదా? అని వ్యాఖ్యానించింది. మళ్లీ విచారణ జరపాలంటూ సింగిల్ జడ్జికి సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News