Share News

ఆర్నెల్లపాటు ‘జలవనరుల సంరక్షణ’

ABN , Publish Date - Nov 06 , 2026 | 05:16 AM

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్న దృష్ట్యా రాష్ట్రంలో జలవనరుల పునరుద్ధరణకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆర్నెల్లపాటు ‘జలవనరుల సంరక్షణ’
Uttam Kumar Reddy

  • 2027 జనవరి నుంచి జూన్‌ దాకా కార్యక్రమం: ఉత్తమ్‌

హైదరాబాద్‌, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడనున్న దృష్ట్యా రాష్ట్రంలో జలవనరుల పునరుద్ధరణకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 జనవరి నుంచి జూన్‌ దాకా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ఆర్నెల్లపాటు జలవనరుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.


వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్‌ దాకా వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు నీటిపారుదలశాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి సంయుక్తంగా జలపునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో గ్రామస్థులను, ప్రధానంగా వ్యవసాయ కూలీలను భాగస్వాములు చేయాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో వల్ల ఉపాధి కోల్పోయే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేలా పనులు చేపట్టాలని, చెరువుల్లో పూడికతీత, చెక్‌డ్యాంల నిర్మాణం, దెబ్బతిన్న తూములు, గేట్ల మరమ్మతులు వంటివి చేపట్టాలన్నారు. భూగర్భ జలాల పెరుగుదల కోసం చతుర్విద జలప్రక్రియ వంటి కార్యక్రమాలు అమలుపై అధ్యయనం చేయాలని అధికారులకు ఆయన సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ బ్రాండ్‌ ప్రపంచానికి చాటాలి

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 06 , 2026 | 05:16 AM