Share News

నేడు ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:03 AM

తెలంగాణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్ఐ) పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఆదివారం 335 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు.

నేడు ఎస్‌ఐ ప్రిలిమ్స్‌ రాత పరీక్ష

  • నిమిషం ఆలస్యం అయినా అనుమతి లేదు

  • నెగిటివ్‌ మార్కుల విధానం అమలు

హైదరాబాద్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్ఐ) పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్‌ రాత పరీక్ష ఆదివారం 335 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించమని, అభ్యర్థులు కనీసం గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 275 ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి 1,60,712 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవనున్నారు.


అభ్యర్థులు తమ ఫొటో అంటించిన హాల్‌ టికెట్లను, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ మాత్రమే తమతో తెచ్చుకోవాలని, ఒరిజనల్‌ ఫొటో గుర్తింపు కార్డు ఏదైనా ఉండాలని, మొబైల్‌ ఫోన్‌, వాచీ, కాలిక్యులేటర్‌, ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్‌లు, నగలు, పర్సు, వాటర్‌ బాటిళ్లను అనుమతించమని అధికారులు తెలిపారు. నెగిటివ్‌ మార్కుల విధానం కాబట్టి సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తే, తప్పు సమాధానానికి 0.20 మార్కులు కట్‌ చేస్తారని... సమాధానం తెలియకపోతే వదిలివేస్తే మార్కులు కట్‌ కావని అధికారులు వివరించారు.


ఇవి కూడా చదవండి...

ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం

21 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై హరీశ్ రావు, జగ్గారెడ్డి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 04:03 AM