ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం
ABN , Publish Date - Mar 29 , 2026 | 09:34 PM
తెలంగాణ శాసనమండలి, శాసనసభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ శాసనమండలి, శాసనసభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తెలంగాణ శాసనసభ, మండలి సభ్యుల కోసం ఈ నెల 28, 29 తేదీల్లో లెజిస్లేచర్ స్పోర్ట్స్ మీట్ - 2026 కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం. అందులో భాగంగా శనివారం ఎల్బీ స్టేడియంలో క్రీడాపోటీలు నిర్వహించగా.. నేడు రవీంద్రభారతిలో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తోంది. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ పోటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రీడాపోటీలను ఛైర్మన్ జూపల్లి కృష్ణారావు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: హరీశ్ రావు
సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు..