Share News

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు!

ABN , Publish Date - Nov 07 , 2026 | 07:02 AM

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రోత్సాహకాలు!

  • పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో అధికారుల భేటీ

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు తెలంగాణ ఎంఎ్‌సఎంఈ పాలసీ-2024 కార్యాచరణ మార్గదర్శకాల్లో సవరణలు చేసేందుకు పరిశ్రమల శాఖ సానుకూలంగా స్పందించిందని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు తెలిపారు.


మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌.కృష్ణ ఆదిత్య.. తమ ప్రతినిధుల బృందంతో సమావేశమై చర్చించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పారిశ్రామిక ప్రోత్సాహకాలు పొందడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రత్యేక రాయితీలు, ప్రాధాన్యాలు, ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలపై వివరించామని తెలిపారు. తమ సూచనలపై కృష్ణ ఆదిత్య సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 07:02 AM