ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Nov 18 , 2026 | 08:02 PM
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణను తాము అమలు చేసి చూపించామని చెప్పారు. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్18: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణను తాము అమలు చేసి చూపించామని చెప్పారు. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు.
అసెంబ్లీ స్పీకర్, కేబినెట్ మంత్రులుగా దళితులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వందేళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో తొలిసారి దళితుడికి వీసీగా అవకాశం కల్పించామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ ఐఐటీలోనూ ఎస్సీ, ఎస్టీలకు వీసీ పదవులు కట్టబెడుతున్నామని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ నిధుల్లో 50 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీల కోసమే వినియోగిస్తున్నామని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు నేపథ్యంలో రేవంత్ సర్కార్‌ను ఫగ్గన్ సింగ్ కులస్తే కమిటీ ప్రశంసలతో ముంచెత్తింది. ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ గణేష్‌తోపాటు కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News