విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:38 AM
విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ విధిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎస్సీ అభివృద్ధి శాఖ ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ విధిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి బోయి విజియేంద్ర 26న మెమో నం.1628/ఎస్‌సీడీ/పీవోఏ-ఏ2, 2026ను జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకే స్వేచ్ఛనిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. దాని ఆధారంగా జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ సిఫారసులతో ఎస్సీలను 3 గ్రూపులుగా విభజిస్తూ... వారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 14న ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్సీల్లోని 15 ఉపకులాలను గ్రూప్-ఏలో చేర్చుతూ 1 శాతం రిజర్వేషన్.. గ్రూప్-బీలో 18 ఉప కులాలను చేర్చి 9 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇక గ్రూప్-సీలో మాలతో పాటు 26 ఉప కులాలను చేర్చుతూ 5 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలు, విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో వర్గీకరణను అమలు చేయట్లేదంటూ మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ విజ్ఞపి చేయడంతో.. తాజా ఆదేశాలు వెలువరించారు. అన్ని ప్రభుత్వ శాఖలు/విభాగాధిపతులు/జిల్లా కలెక్టర్లు విధిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని నిర్దేశిస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు దీన్ని అమలు చేయాలని నిర్దేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు
కేటీఆర్ నాపై ట్రోల్ చేయిస్తున్నారు
హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రావొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News