కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:26 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.
బల్మూరి వెంకట్, అద్దంకిలకు కోర్టు ఆంక్షలు
హైదరాబాద్, అక్టోబర్ 28 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావాపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం బీఆర్‌ఎస్ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి.
తనకు డ్రగ్స్‌తో సంబంధం ఉందంటూ.. మహిళలు, సినీ ప్రముఖులతో వ్యక్తిగత సంబంధాలపై సరైన ఆధారాలు లేకుండా వీడియోలు, ఇంటర్వ్యూలు, వార్తా కథనాల ద్వారా దుష్ప్రచారం చేయడం వంటి అంశాలను కేటీఆర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఆరోపణల వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు. విచారణ జరిపిన కోర్టు.. వివాదాస్పద ఆరోపణలకు సంబంధిత కథనాలను, వీడియోలను తొలగించాలని మీడియా సంస్థలను ఆదేశించింది. భవిష్యత్తులోనూ దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి ఎటువంటి కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రావొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News