Share News

కేటీఆర్‌ నాపై ట్రోల్‌ చేయిస్తున్నారు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:33 AM

‘ఓ ఎస్సీ యువతి, ఓ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం తప్పా?’ అంటూ ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ సతీమణి ఇందుజా ప్రశ్నించారు.

కేటీఆర్‌ నాపై ట్రోల్‌ చేయిస్తున్నారు
Balmoori Induja

  • హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు బల్మూరి వెంకట్‌ భార్య ఫిర్యాదు

  • ఓ ఎస్సీ యువతి, వెలమ అబ్బాయిని ప్రేమించడం తప్పా?

  • మా పెళ్లి ఫొటోల్ని వక్రీకరించి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం

  • సీపీకి ఫిర్యాదులో ఆరోపించిన బల్మూరి ఇందుజా

హైదరాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘ఓ ఎస్సీ యువతి, ఓ వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించడం తప్పా?’ అంటూ ప్రభుత్వ విప్‌ బల్మూరి వెంకట్‌ సతీమణి ఇందుజా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కులపిచ్చితో.. అనుకూల సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా తనపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. పెద్దల సమ్మతితో.. అందరి సమక్షంలోనే తమ వివాహం జరిగిందని తెలిపారు.


తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేసిన పెళ్లి ఫొటోలను వక్రీకరించి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం దారుణమని బుధవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా తన భర్తను ఎదుర్కోలేకే ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌పై తన భర్త చేసిన ఆరోపణ లకు ఆధారాలు ఉన్నాయని ఇందుజా స్పష్టం చేశారు. తమపై ఆరోపణలు చేస్తున్న వారు కూడా ఆధారాలను బయటపెట్టాలని సవాల్‌ విసిరారు.


సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల కారణంగా ఎంతోమంది మహిళలు అవమానాలకు గురవుతున్నారని, సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్‌ ‘రామ్‌ కేటీ’, ‘కే రామ్‌’ అనే పేర్లతో దుబాయ్‌ వెళ్లారని, ఆ ప్రయాణంలో ఇద్దరు హీరోయిన్లు సహా నలుగురు ప్రముఖులు ఆయన వెంట ఉన్నారని ఇటీవల బల్మూరి వెంకట్‌ ఆరోపించడం ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా వెళ్తే అందరికీ తెలుస్తుందని, బెంగళూరు, ఢిల్లీ మీదుగా వెళ్లారని, ఇంట్లో అబద్ధాలు చెప్పారని వెంకట్‌ విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేయొద్దు

కరువుకు మీరే కారకులు!

హైదరాబాద్‌లో తాగునీటి సమస్య రావొద్దు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 04:33 AM