Share News

ఎనిమిది రోజుల్లో 370 కేసులు

ABN , Publish Date - Nov 07 , 2026 | 04:10 AM

బియ్యానికి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న, తూకాల్లో మోసగిస్తున్న వ్యాపారులపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉక్కుపాదం మోపింది.

ఎనిమిది రోజుల్లో 370 కేసులు
Telangana Rice Raids

  • బియ్యం అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం

  • రైస్‌మిల్లులు, డీలర్లు,

  • రిటైల్‌ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు

  • 25 కిలోలే నింపి 26 కిలోల లేబుల్‌

  • భారీ ఎత్తున జీఎస్టీ ఎగవేతలు

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): బియ్యానికి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్న, తూకాల్లో మోసగిస్తున్న వ్యాపారులపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉక్కుపాదం మోపింది. ఎన్‌ఫోర్సుమెంట్‌ టాస్క్‌ఫోర్స్‌(ఈటీఎఫ్‌), తూనికలు- కొలతల(లీగల్‌ మెట్రాలజీ) శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ బృందాలు గత నెల 29 నుంచి ఈ నెల 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైస్‌మిల్లులు, హోల్‌సేల్‌ డీలర్లు, రిటైల్‌ దుకాణాల్లో ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. మొత్తం 370 కేసులు నమోదు చేశాయి. ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం అందించేందుకు ఎక్కువగా వినియోగించే రకాలకు ప్రభుత్వం ఇటీవల గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ) ఖరారు చేసింది. బీపీటీ, కేఎన్‌ఎం రకాలు కిలో రూ.66, తెలంగాణ సోనా/ఆర్‌ఎన్‌ఆర్‌ రూ.74, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ రూ.79కి మించి విక్రయించరాదని ఆదేశించింది.


మార్కెట్లో పారదర్శకత కోసం ప్రతి 26 కిలోల బస్తాపై ఎమ్మార్పీని తప్పనిసరిగా ముద్రించాలని రైస్‌ మిల్లర్లు, వ్యాపారులకు ఉత్తర్వులిచ్చింది. వినియోగదారులను మోసగిస్తే ఉపేక్షించేది లేదని కమిషనర్‌ పలుమార్లు హెచ్చరించారు. అయినా మోసాలు ఆగకపోవడంతో ప్రత్యేక బృందాలను పంపి దాడులు చేయించారు. 1,141 చోట్ల ఈటీఎఫ్‌.. 1,545 చోట్ల తూనికల శాఖ ఈటీఎఫ్‌ బృందాలు 1,141 చోట్ల తనిఖీలు చేశాయి. నిబంధనలు పాటించని వారిపై 55 కేసులు పెట్టాయి. మరో 35 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాయి. తూనికలు- కొలతల శాఖ అధికారులు 1,545 చోట్ల తనిఖీలు నిర్వహించి 280 కేసులు పెట్టారు. బస్తాల్లో 25 కిలోల బియ్యమే నింపి, పైన 26 కిలోల లేబుల్‌ అతికించి అమ్ముతున్న వ్యాపారులను అధికారులు పట్టుకున్నారు. అసలు ధర కనిపించకుండా దానిపై అధిక ధర స్టిక్కర్లు అంటించిన ఉదంతాలూ వెలుగుచూశాయి. రేషన్‌(పీడీఎ్‌స) బియ్యం అక్రమ నిల్వలు, జీఎస్టీ, ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ లైసెన్సులు లేకుండా చేస్తున్న వ్యాపారాలనూ అధికారులు గుర్తించారు.


పదేపదే చేస్తే పీడీ యాక్టు

ధరల దోపిడీ, అక్రమ వ్యాపారం నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యమని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. రేషన్‌ బియ్యాన్ని పదేపదే అక్రమంగా నిల్వ చేసే వారిపై, మార్కెట్‌ ధరలను కృత్రిమంగా పెంచే వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. తప్పులు పునరావృతం చేసేవారిపై నిత్యావసర సరకుల చట్టం, బీఎన్‌ఎ్‌స కింద కేసులు పెట్టి జైలుకు పంపుతామన్నారు. దాడులు ఈ వారానికే పరిమితం కావని, సాధారణ వినియోగదారుల రక్షణకు రాష్ట్రవ్యాప్తంగా నిరంతర నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై అసెంబ్లీ!

మరో రెండు పథకాలు

కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 04:10 AM