బియ్యం ధరలు అడ్డగోలుగా పెంచితే ఉపేక్షించేది లేదు
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:54 AM
అక్రమ నిల్వలు చేసి, కృత్రిమ కొరత సృష్టించి.. బియ్యం ధరలు అడ్డగోలుగా పెంచితే ఉపేక్షించేది లేదని వ్యాపారులు, రైస్‌మిల్లర్లను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
బీపీటీ బియ్యం కిలోకు రూ.66కు మించొద్దు: ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిల్వలు చేసి, కృత్రిమ కొరత సృష్టించి.. బియ్యం ధరలు అడ్డగోలుగా పెంచితే ఉపేక్షించేది లేదని వ్యాపారులు, రైస్‌మిల్లర్లను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రజలు ఎక్కువగా వినియోగించే బీపీటీ బియ్యం ధర కిలోకు రూ.66కు మించకుండా చర్యలు తీసుకోవాలని, ధరలు స్థిరపడే వరకు దాడులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్ క్యాంపు కార్యాలయంలో పౌరసరఫరాలశాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తేవటానికి రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశామని తెలిపారు. రాష్ట్రంలో బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. కొరత వస్తుందనే ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలుచేసి నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేషన్ ద్వారా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. ఇక్కడ పండిన ధాన్యాన్ని రాష్ట్రంలోని మిల్లుల్లోనే బియ్యంగా మార్చి రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యారంటీ లేకుండానే రైస్ మిల్లు ఆస్తుల బదిలీ
క్యాన్సర్ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
బీఆర్‌ఎస్ కాపాడిన భూమిని.. రేవంత్ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News