Share News

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి: ట్రెసా

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:42 AM

రెవెన్యూ ఉద్యోగులకు ఏడాదికి పైగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ట్రెసా కోరింది.

ఉద్యోగుల బకాయిలు చెల్లించండి: ట్రెసా
TRESA

హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ ఉద్యోగులకు ఏడాదికి పైగా రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ట్రెసా కోరింది. ఈ మేరకు మంగళవారం ట్రెసా అధ్యక్షుడు గౌతమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి రమణ్‌రెడ్డి నేతృత్వంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియాను కలిసి వినతిపత్రం సమర్పించారు.


2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వాహనాల అద్దె బకాయిలు చెల్లించకపోవడం వల్ల తహసీల్దార్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారు రక్షేత్రస్థాయి విచారణలు, కోర్టు కేసులు, ప్రొటోకాల్‌ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు గౌరవ వేతనం పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు

డిజైన్లు ధూంధాంగా ఉండాలి

వ్యభిచారం చెయ్‌.. భార్యపై తాగుబోతు భర్త ఒత్తిడి!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:42 AM