వీబీజీరామ్‌జీ పనుల కల్పనలో తెలంగాణ రికార్డు
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:27 AM
ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
రోజుకు సగటున 4 లక్షల మంది కూలీలకు ఉపాధి
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించడంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీబీజీరామ్‌జీ పథకం కింద గతంలో ఎన్నడూ లేని విధంగా కూలీలకు పనులు కల్పిస్తూ అరుదైన రికార్డును నమోదు చేసింది. నవంబరు 1 నుంచి 15వ తేదీ వరకు రోజూ సగటున 4 లక్షల మంది కూలీలకు పని కల్పించడం కీలక మైలురాయిగా నిలిచింది.
అధికారిక నివేదిక ప్రకారం... ఈ నెల ఒకటో తేది నుంచి ఆదివారం వరకు పనులకు హాజరైన కూలీల సంఖ్యను చూస్తే.. 3, 4, 5, 6, 12, 14 వ తేదీల్లో ఒక్కో రోజు 5 లక్షలకు పైగా కూలీలు హాజరయ్యారు. రానున్న నెలల్లో ఉపాధి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో తదనుగుణంగా ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసింది. 2026 అక్టోబరు నుంచి 2027 జూన్ వరకు మొత్తం 19 కోట్ల పనిదినాలు కల్పించాలని నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News