Share News

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి.. ఎన్నిక లాంఛనమే

ABN , Publish Date - Mar 06 , 2026 | 05:35 PM

రాజ్యసభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పత్రాలు పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సాయి అనే వ్యక్తి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తి.. ఎన్నిక లాంఛనమే

హైదరాబాద్, మార్చి 06: రాజ్యసభ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పత్రాలు పరిశీలన శుక్రవారం పూర్తయింది. ఈ సందర్భంగా ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సాయి అనే వ్యక్తి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. రాజ్యసభ అభ్యర్థిగా బలపరుస్తూ 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు నామినేషన్ పత్రాలు ఉండాలని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. కానీ ఆ సంతకాలు సాయి దాఖలు చేసిన నామినేషన్ పత్రాలపై లేవని అధికారులు వివరణ ఇచ్చారు. అందువల్ల ఈ పత్రాలను తిరస్కరించినట్లు వారు తెలిపారు.


దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ బరిలో నిలిచిన అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అభిషేక్ సింఘీకి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వరుసగా మరోసారి అవకాశం కల్పించింది. ఇక వేం నరేందర్ రెడ్డిని తొలిసారిగా రాజ్యసభకు ఎంపిక చేసింది. అసలు అయితే రాజ్యసభ సీటు ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి కేటాయిస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం గతంలో ప్రకటించింది.


ఇక మరో రాజ్యసభ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చాలా మంది పోటీ పడ్డారు. దాదాపు 16 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసి .. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తీసుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఎంపిక చేశారు. వివాదరహితుడు కూడా కావడంతో.. ఆయన వైపు అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు ఫిర్యాదు

సివిల్స్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు

For More TG News And Telugu News

Updated Date - Mar 06 , 2026 | 05:42 PM