Share News

పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘ఫిట్‌కాప్‌’ యాప్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:43 AM

రాష్ట్రంలోని 90 వేల మంది పోలీసుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా పోలీసు శాఖలో ‘ఫిట్‌ కాప్‌’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.

పోలీసుల ఆరోగ్య భద్రతకు ‘ఫిట్‌కాప్‌’ యాప్‌
CV Anand

  • నిరంతర పర్యవేక్షణతో వైద్య పరీక్షలు, సూచనలు: డీజీపీ

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 90 వేల మంది పోలీసుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా పోలీసు శాఖలో ‘ఫిట్‌ కాప్‌’ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌, ఇతర సంస్థల సహకారంతో రూపొందించిన ఈ యాప్‌ పని తీరును డీజీపీ సీవీ ఆనంద్‌ శుక్రవారం సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫైల్‌ సిస్టమ్‌గా రూపొందించిన ఈ విధానాన్ని ప్రత్యేక యాప్‌ ద్వారా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ యాప్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90 వేల మంది పైగా పోలీసులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇందులో 8 ప్రధాన ఆరోగ్య విషయాలకు సంబంధించిన ప్రశ్నలతో పాటు, వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నమోదు చేసే అవకాశాన్ని కల్పించామని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:43 AM