ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్!
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:13 AM
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జిషీట్‌కు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఏ1గా, ఆయన కుమారుడు, అప్పటి మంత్రి కేటీఆర్‌ను ఏ2గా పేర్కొనడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జిషీటుకు రంగం సిద్ధం
ట్యాపింగ్ వెనక కుట్రకు సంబంధించి ఆధారాల సేకరణ
న్యాయ నిపుణుల అభిప్రాయాల తర్వాత సిట్ నిర్ణయం
సీఎంకు ఇప్పటికే బ్రీఫింగ్.. త్వరలో కోర్టుకు చార్జిషీట్
ట్యాపింగ్ చేసిన వారు, అనుమతిచ్చినవారు నిందితులే
ఆ సంభాషణల్ని వినియోగించుకున్న వాళ్లు కూడా..
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తుది చార్జిషీట్‌కు రంగం సిద్ధమైంది. ఈ కేసులో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఏ1గా, ఆయన కుమారుడు, అప్పటి మంత్రి కేటీఆర్‌ను ఏ2గా పేర్కొనడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్లు సమాచారం. అలాగే, ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చిన ఉన్నతాధికారుల పేర్లు, వారి పాత్రను వివరంగా సాక్ష్యాధారాలతో సిట్ అధికారులు పేర్కొనబోతున్నారని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు బ్రీఫింగ్ ఇచ్చారని, త్వరలో న్యాయస్థానంలో తుది చార్జీషీట్ దాఖలు చేయనున్నారని సమాచారం. చట్టవిరుద్ధమని తెలిసినా ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతించడం, తనకు అనుకూలురైన అధికారులకు ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్‌లో కీలక బా ధ్యతలు అప్పగించి, వారి ద్వారా ప్రజా ప్రతినిధులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సె లబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేయించడం వెనుక నిర్దిష్ట కుట్ర ఉందన్న విషయాలకు సంబంధించి సిట్ అధికారులు పలు కీలక సాక్ష్యాధారాలను ఇప్పటికే సేకరించారు.
రాష్ట్రానికి చెందిన సీనియర్ న్యాయవాదులతోపాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సూచనలు తీసుకున్నారని, న్యాయపరంగా చార్జిషీట్ పటిష్ఠంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని సమాచారం. ఫోరెన్సిక్, సాంకేతిక ఆధారాలతోపాటు ఫోన్ ట్యాపింగ్‌కు గురైన వందలమంది బాధితుల వాంగ్మూలాలను చార్జిషీట్‌లో పొందుపరచనున్నార ని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌ద్వారా అక్రమ నిఘా కార్యక్రమాలు సాగించడానికి నాటి సీఎం కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని, ఇందుకు ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఇచ్చిన అనుమతులు, కొందరు నిందితులు, మరికొందరు బాధితుల వాంగ్మూలాలను ఆధారాలుగా సిట్ అధికారులు చూపించనున్నారని తెలిసింది. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని తమ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు రాయించుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుందని తెలుస్తోంది.
అలాగే, ట్యాపింగ్‌కు ఎస్‌ఐబీ అధికారులు మావోయిస్టుల పేరిట పంపిన ఫోన్ నంబర్లను యథాతథంగా అనుమతించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పాత్రను సిట్ అధికారులు తుది చార్జిషీటులో ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. వీరిలో కొందరి వాంగ్మూలాలను ఇప్పటికే సేకరించారు కూడా. ప్రధానంగా.. అక్రమమని తెలిసినా, మావోయిస్టుల కోటాలో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ముఠా, ట్యాపింగ్‌కు అనుమతిచ్చిన ఉన్నతాధికారు లు, అక్రమమని తెలిసినా కొనసాగించిన ఉన్నతాధికారులు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎన్నికల్లో, ప్రభుత్వ నిర్వహణలో వాడుకున్న పెద్దలు,సహకరించిన మరికొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లను ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. అయితే దర్యాప్తు వివరాలు లీక్ అవుతున్నాయన్న నిఘావ ర్గాల సమాచారంతో సీఎం ఇటీవల పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News