Share News

పోలీసుల అదుపులో పీడీఎస్‌ బియ్యం?

ABN , Publish Date - Nov 12 , 2026 | 06:06 AM

మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో పీడీఎస్‌ బియ్యం?
PDS Rice Seized

చిన్నగూడూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 580 బస్తాల బియ్యంతో ఇనుగుర్తి నుంచి చిన్నగూడూరులోని ఓ మిల్లుకు తరలిస్తున్నట్టు గుర్తించారు.


ఈ-వే బిల్లులో చిన్నగూడూరు నుంచి మరిపెడ మండలం గిరిపురం తరలించాలని ఉండగా.. గుండంరాజుపల్లి రూట్‌లో ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది? అని అధికారులు విచారణ చేపట్టారు. చిన్నగూడూరు తహసీల్దార్‌, పోలీసులు, పౌర సరఫరాల శాఖ తొర్రూరు డివిజన్‌ డీటి కామేశ్వరరావు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 06:06 AM