‘పీఏసీఎస్’ల ఎన్నికలపై ఇంత జాప్యమా?
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:51 AM
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల ఎన్నికల జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల ఎన్నికల జాప్యంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీలను ఏర్పాటు చేయడాన్ని తప్పు పట్టింది. పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించకపోవడం, నామినేటెడ్ పద్ధతిలో పర్సన్ ఇన్‌ఛార్జిలను నియమించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ఎనిమిది వేర్వేరు రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!
తెలంగాణలో ష్నైడర్ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News