Share News

ఈహెచ్‌ఎస్ ఆస్పత్రులు ఉద్యోగుల అడ్మిషన్లను తిరస్కరించొద్దు: సీఎస్‌

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:17 AM

‘న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఎన్‌ఈహెచ్‌ఎస్)’ కింద ఆస్పత్రుల్లో చేరే ఉద్యోగులు, పెన్షనర్ల అడ్మిషన్లను ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సూచించారు.

ఈహెచ్‌ఎస్ ఆస్పత్రులు ఉద్యోగుల అడ్మిషన్లను తిరస్కరించొద్దు: సీఎస్‌
Sanjay Jaju

‘న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఎన్‌ఈహెచ్‌ఎస్)’ కింద ఆస్పత్రుల్లో చేరే ఉద్యోగులు, పెన్షనర్ల అడ్మిషన్లను ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించరాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు సూచించారు. ఈ పథకానికి సంబంధించి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌’ బోర్డు సమావేశంలో ఆయన ఉద్యోగ సంఘాల నాయకులు, బోర్డు సభ్యులతో పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు ఆస్పత్రుల్లో అడ్మిషన్లు, వైద్య చికిత్సలు, బిల్లుల చెల్లింపులపై పలు సమస్యలు, ఆటంకాలను సీఎస్‌ దృష్టికి తెచ్చారు. దీంతో ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలపై యశోద, అపోలో, కిమ్స్‌ ఆస్పత్రుల ప్రతినిధులతో సీఎస్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఎన్‌ఈహెచ్‌ఎస్ విషయంలో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రమంత్రి ప్రశంసలు.. మంత్రి సీతక్కకు శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 06:17 AM