Share News

మున్సిపల్ ఎన్నికలు.. సత్తా చాటిన హస్తం పార్టీ

ABN , Publish Date - Feb 13 , 2026 | 07:26 PM

పంచాయతీ ఎన్నికల్లోనే కాదు.. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.

మున్సిపల్ ఎన్నికలు.. సత్తా చాటిన హస్తం పార్టీ

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డులకు గాను 2,581 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 1,349 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో 74 మున్సిపాలిటీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ 718 వార్డుల్లో గెలుపొందింది. దాంతో 17 మున్సిపాలిటీలను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక 25 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. బీజేపీ అభ్యర్థులు 260 వార్డుల్లో గెలుపొందారు. స్వాతంత్ర అభ్యర్థులు.. 254 వార్డుల్లో విజయం సాధించారు. అయితే నారాయణ్‌పేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మరణించారు. దీంతో ఆ వార్డు ఎన్నిక జరగలేదు. అందువల్ల 2581 వార్డుల ఫలితాలను ప్రకటించారు.


38 మున్సిపాలిటీల్లో మాత్రం ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కైవసం చేసుకుంది. అలాగే జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచి అత్యధిక స్థానాల్లో విజయం సాధించడం గమనార్హం.


కార్పొరేషన్లలో సైతం హస్తం హవా..

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రామగుండం, మంచిర్యాల, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ తన సత్తా చాటింది. మహబూబ్‌నగర్‌లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ స్థానం సైతం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మరో వైపు ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వకపోవడంతో.. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. కార్పొరేషన్లలో కాంగ్రెస్ 4, బీజేపీ 1, రెండింటిలో హంగ్ ఏర్పడనుంది.


7 కార్పొరేషన్లు..

  • రామగుండం (60 డివిజన్లు) : కాంగ్రెస్ (కాంగ్రెస్ 38, బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 8)

  • నిజామాబాద్ (60 డివిజన్లు) : బీజేపీ ( కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 1, బీజేపీ 28, ఇతరులు 14)

  • మహబూబ్‌నగర్ (60 డివిజన్లు) : కాంగ్రెస్ ( కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 10, బీజేపీ 6, ఇతరులు 5) (లెక్కింపు జరుగుతోంది).

  • మంచిర్యాల (60 డివిజన్లు): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 3).

  • కరీంనగర్ (60 డివిజన్లు): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, బీజేపీ 30, ఇతరులు 13).

  • నల్గొండ ( 48 డివిజన్లు): కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఇతరులు 8).

  • కొత్తగూడెం ( 60 డివిజన్లు): కాంగ్రెస్ ( కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ1, ఇతరులు 29).


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..

ప్రజా పాలన ఫలితమే ఈ విజయం: సీఎం రేవంత్ రెడ్డి..

For More TG News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 10:00 PM