కార్యాలయాల నిర్వహణకు నిధులివ్వాలి
ABN , Publish Date - Nov 02 , 2026 | 06:15 AM
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రజావాణి చేపట్టేందుకు, మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణకు ప్రతీ నెలా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు పద్మావతి కోరారు.
వాహన సౌకర్యం కల్పించాలి: ఎంపీడీవోల అసోసియేషన్
హైదరాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ప్రజావాణి చేపట్టేందుకు, మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణకు ప్రతీ నెలా ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు పద్మావతి కోరారు. తెలంగాణ ఎంపీడీవోల అసోసియేషన్ సెంట్రల్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందులో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు గంగుల సంతోష్ కుమార్, కోశాధికారి మహేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ.. ఎంపీడీవోలకు రెగ్యులర్‌గా వాహన సదుపాయం కల్పిస్తూ ప్రతినెలా ట్రెజరీ ద్వారా నిధులు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు డివిజనల్ లెవెల్ డెవల్‌పమెంట్ అధికారి(డీఎల్‌డీవో) పోస్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. గ్రూప్ 1 స్థాయి ఎంపీడీవోలకు ఆయా శాఖల్లోని గ్రూప్ 1 అధికారుల మాదిరిగానే.. పేస్కేల్ ఇవ్వాలని, అడహక్ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ ఎంపీడీవోలుగా నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు పద్మావతి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News