తెలంగాణ ఉద్యమకారుల కోసం త్వరలో వెబ్‌సైట్
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:35 AM
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా మొదట ఉద్యమకారులను గుర్తించాల్సి ఉందని, అందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
ఉద్యమంలో పాల్గొన్నవారంతా దరఖాస్తు చేసుకోవాలి
వివరాలను నిర్ధారించాక ఉద్యమకారులుగా గుర్తింపు
టీయూడబ్ల్యూజే-ఐజేయూ కార్యక్రమంలో కోదండరామ్
దిల్‌సుఖ్‌నగర్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి న్యాయం చేసే ప్రక్రియలో భాగంగా మొదట ఉద్యమకారులను గుర్తించాల్సి ఉందని, అందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యుడు, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చాక ఉద్యమకారులు.. తాము ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నట్లుగా నిర్ధారించే వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
టీయూడబ్ల్యూజే-ఐజేయూ అనుబంధ ఎల్‌బీనగర్ జర్నలిస్టుల బృందం ఆధ్వర్యంలో మంగళవారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ఉద్యమం-జర్నలిస్టుల సందేహాలు, అవగాహన’ కార్యక్రమానికి కోదండరామ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలోనే టీయూడబ్ల్యూజే-ఐజేయూ తెలంగాణ అధ్యక్షుడు విరాహత్ అలీ మాట్లాడుతూ.. ఉద్యమ జర్నలిస్టులను గుర్తించి, తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర మీడియా అకాడమీ తరఫున ప్రస్తుతం ఇస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయాన్ని 2లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే, వారికి ఇచ్చే పెన్షన్‌ను రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలన్నారు.
ఇవి కూడా చదవండి...
కోనసీమ జిల్లాలో భారీ శబ్దాలతో గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు
కోనసీమ గ్యాస్ లీకేజీపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News