11.89 లక్షల ఓటర్లు
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:56 AM
తెలంగాణలోని రెండు పట్టుభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు బుధవారం విడుదల చేశారు.
2 ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల సంఖ్య
ముసాయిదా ఓటరు జాబితా విడుదల
80,635 దరఖాస్తుల తిరస్కరణ
10 వరకు అభ్యంతరాలు.. 30న తుది ప్రకటన
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని రెండు పట్టుభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు బుధవారం విడుదల చేశారు. రెండు నియోజకవర్గాల్లో కలిపి 11,89,191 మంది ఓటర్లుగా అర్హత సాధించారు. మొత్తం 12,69,826 దరఖాస్తులు రాగా.. 80,635 దరఖాస్తులను తిరస్కరించారు.
2021లో ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 10,36,833 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 1,52,358 మంది పెరిగారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 5,68,105 మంది, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలో 6,21,086 మంది ఓటర్లుగా అర్హత సాధించారు. ముసాయిదా జాబితాపై డిసెంబరు 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. డిసెంబరు 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి తుది జాబితా విడుదలైన తర్వాత కూడా ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అవకాశం ఉంటుంది.
పురుష ఓటర్లే అధికం
మొత్తం ఓటర్లలో 7,10,652 మంది పురుషులు, 4,78,528 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో పేరు లేనివారు, గతంలో ఓటరుగా నమోదైనవారు కూడా ఈసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సీఈవో సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఈసారి డీ-నోవో విధానంలో జాబితా రూపొందించినందున పాత జాబితాలోని పేర్లు ఆటోమేటిక్‌గా కొనసాగవని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News