Share News

హింసా ప్రవృత్తిని పెంచుతున్న సినిమా రంగాన్ని ప్రశ్నించాలి: ఎమ్మెల్సీ దేశపతి

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:51 AM

సమాజంలో వికృత పోకడలను, హింసా ప్రవృత్తిని పెంచడానికి దోహదపడుతున్న సినిమా రంగాన్ని నిలదీయాలి అని ఎమ్మెల్సీ దేశపతి పిలుపునిచ్చారు.

హింసా ప్రవృత్తిని పెంచుతున్న సినిమా రంగాన్ని ప్రశ్నించాలి: ఎమ్మెల్సీ దేశపతి
MLC Deshapathi

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సమాజంలో వికృత పోకడలను, హింసా ప్రవృత్తిని పెంచడానికి దోహదపడుతున్న సినిమా రంగాన్ని నిలదీయాలి అని ఎమ్మెల్సీ దేశపతి పిలుపునిచ్చారు. సమాజంలో రాక్షసత్వం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మనిషిని సంస్కరించాల్సిన, ఉదాత్తమైన వ్యక్తులుగా మారడానికి సినిమాలు ప్రేరణగా నిలవాలని, కానీ ప్రస్తుత ఆ విధానం కనిపించడంలేదన్నారు. ఆదివారం రవీంద్ర భారతిలో తెలంగాణ రచయితల సంఘం పన్నెండేళ్ల సభలు ‘వర్తమాన సాహిత్యం తెలంగాణ సంభాషణ’ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన మనసున్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచి వేస్తోందని అన్నారు. సినిమాల్లో హింసను ఆకర్షణీయంగా చూపించడమే ఇలాంటి అమానవీయ ఘటనలు జరగడానికి ప్రధాన కారణమని విమర్శించారు.


తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. కవులు, రచయితలపై అనధికార నిర్బంధం కొనసాగుతోందని దుయ్యబట్టారు. స్వేచ్ఛగా సాహిత్య సృజన కొనసాగించడానికి అవకాశం లేని విధంగా ఒక భయానక వాతావరణాన్ని దేశంలో ప్రస్తుతం చూస్తున్నామని ఆవేదన వెలిబుచ్చారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ సాహిత్యం ఉద్యమ వేగాన్ని, స్వభావాన్ని, ప్రభావశీలతను కోల్పోయిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ అస్తిత్వ ప్రయాణాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ ఏనుగు నరసింహా రెడ్డి, నాళేస్వరం శంకరం, విరాహత్‌ అలీ, బైసా దేవదాసు, తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి శంకర్‌, వీక్షణం వేణుగోపాల్‌, ఆచార్య బన్న ఐలయ్య తదితరులు ప్రసంగించారు. కందుకూరి శ్రీరాములు సభాధ్యక్షతలో కవి సమ్మేళనం జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 05:51 AM