మీసేవలో యూరియా బుకింగ్: తెలంగాణ ప్రభుత్వం
ABN , Publish Date - Jul 08 , 2026 | 09:06 PM
రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.
హైదరాబాద్, జులై 08: రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. యాప్ లేకున్నా యూరియా బుకింగ్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించింది. పీపీబీ నంబర్‌తో మీసేవల బుకింగ్ చేసుకోవచ్చని సూచించింది. ఓటీపీ ధ్రువీకరణతో వెంటనే బుకింగ్ ఐడీ వస్తుందని పేర్కొంది. ఈ బుకింగ్ ఐడీ 48 గంటలపాటు చెల్లుబాటు అయ్యే విధంగా ఉంటుందని తెలిపింది. ఎంపిక చేసిన డీలర్ వద్ద యూరియా కొనుగోలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
మీసేవ సేవా రుసుము కేవలం రూ.10గా నిర్ణయించినట్లు వివరించింది. యాప్ లేదా మీసేవ ద్వారానే అధికారిక బుకింగ్ ఉంటుందని స్పష్టం చేసింది. అందుకు యాక్టివ్ మొబైల్ నంబర్ తప్పనిసరి అని పేర్కొంది. ఏమైనా సందేహాల ఉంటే ఏఈవో (AEO), ఎమ్‌ఏఓ (MAO) లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించాలని రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
రావణ్, ప్రకాశ్ రాజ్‌లకు వైసీపీ మద్దతు.. దేశం మీద దాడి చేయడమే: విజయసాయి రెడ్డి
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News