Share News

అమెరికా బహిష్కరించినా డ్రగ్స్‌ దందా!

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:37 AM

నాలుగు రోజుల క్రితం భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన మాదకద్రవ్యాల దాడుల్లో పట్టుబడిన నిందితుల్లో తెలంగాణకు చెందిన టి మనోజ్‌.. గతంలో డ్రగ్స్‌ కేసులో అమెరికా నుంచి బహిష్కరణకు గురైనట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

అమెరికా బహిష్కరించినా డ్రగ్స్‌ దందా!

  • భారత్‌కు తిరిగొచ్చాక కూడా అక్రమ రవాణా

  • తెలంగాణ యువకుడు మనోజ్‌ నేర చరిత్ర

న్యూఢిల్లీ, నవంబరు 24: నాలుగు రోజుల క్రితం భారత్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించిన మాదకద్రవ్యాల దాడుల్లో పట్టుబడిన నిందితుల్లో తెలంగాణకు చెందిన టి మనోజ్‌.. గతంలో డ్రగ్స్‌ కేసులో అమెరికా నుంచి బహిష్కరణకు గురైనట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మనోజ్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేసి.. అమెరికాలో మాస్టర్స్‌ చేస్తున్న సమయంలో నిషేధిత డ్రగ్స్‌ను అక్రమంగా విక్రయించేవాడు. భారత్‌కు తిరిగి వచ్చాక కూడా అతడు అంతర్జాతీయ ముఠాతో కలిసి ఈ కార్యకలాపాలు కొనసాగించినట్టు అధికారులు తెలిపారు.


ఈ దాడుల్లో పట్టుబడిన ఇతర నిందితుల్లో ఎంబీఏ, బీటెక్‌ పూర్తిచేసిన వారూ ఉన్నట్టు పేర్కొన్నారు. ‘ఆపరేషన్‌ మాన్‌సూన్‌ థండర్‌’లో భాగంగా భారత నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ), అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీఈఏ) సంయుక్తంగా దాడులు చేసి, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నాయి. దర్యాప్తు సమయంలో మనోజ్‌ను డ్రగ్స్‌ వ్యాపారం చేశాడన్న ఆరోపణలపై 2024 జనవరిలో అమెరికా నుంచి బహష్కరించినట్టు వారు గుర్తించారు. 2022 జూన్‌ నుంచి ఈ ఏడాది నవంబరు వరకు ఈ ముఠా 3వేల పార్శిళ్ల ద్వారా 5 లక్షల నిషేధిత ఓపియాయిడ్‌ మాత్రల (జనాక్స్‌, ట్రమడాల్‌, వాలియం, యాంబియెన్‌ వంటివి)ను భారత్‌ నుంచి అమెరికాలోని వినియోగదారులకు అక్రమంగా సరఫరా చేసినట్టు ఎన్‌సీబీ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఆరనీకుమా ఈ దీపం..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:37 AM