క్యూఆర్ కోడ్‌తో వాటర్ ప్రూఫ్ పాస్ పుస్తకాలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:05 AM
భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చేపడుతున్న సమగ్ర భూముల రీ-సర్వే దేశానికే ఆదర్శంగా నిలవనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఏడాదిన్నరలోగా రాష్ట్రంలోని ప్రతి అంగుళం సర్వే
కలెక్టర్ల ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం: పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చేపడుతున్న సమగ్ర భూముల రీ-సర్వే దేశానికే ఆదర్శంగా నిలవనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి రైతులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున 373 గ్రామాల్లో రీ-సర్వే చేపడుతున్నామని, ఈ ప్రక్రియ డిసెంబరు చివరి నాటికి పూర్తి కానుందని వెల్లడించారు. సర్వే సమయంలో భూమి విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు ఉన్న ప్రాంతాల్లో రైతుల మధ్య వివాదాలు తలెత్తకుండా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రత్యక్షంగా పాల్గొనాలని ఆదేశించినట్లు తెలిపారు.
రైతుల అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన చోట తగిన సవరణలు చేస్తామని తెలిపారు. సర్వేలో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని, నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత వాటర్ ప్రూఫ్‌తోపాటు చిరిగిపోని విధంగా ఉండే పాస్ పుస్తకాలను రైతులకు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. పాస్ పుస్తకంపై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని, దానిని స్కాన్ చేయగానే సంబంధిత భూమి సర్వే నంబర్, విస్తీర్ణం, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ తదితర వివరాలు వస్తాయని వివరించారు. వ్యవసాయ భూములతో పాటు గ్రామాల్లోని నివాస స్థలాలు, ఇళ్లు, ఆబాదీ ఆస్తులపైనా సమగ్ర సర్వే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. వ్యవసాయ భూములు, ఆబాదీ ఆస్తులకు వేర్వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు వివరించారు. కాగా, తెలంగాణపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని పొంగులేటి విమర్శించారు. రాష్ట్రానికి 13 లక్షల ఇళ్లు కావాలని అడిగితే, రెండు లక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేశారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ ఫిష్ మార్కెట్లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం
డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్
Read Latest Telangana News And Telugu News