Share News

మాకొద్దీ కొలువులు!

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:55 AM

పని ఒత్తిడి... నిరంతర సమీక్షలు వెరసి నీటిపారుదల శాఖ అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ బాట పడుతున్నారు.

మాకొద్దీ కొలువులు!
Telangana Irrigation Department

  • ఒత్తిడి తట్టుకోలేక స్వచ్ఛంద పదవీ విరమణ

  • వీఆర్‌ఎస్‌ పెట్టుకున్న ఇద్దరు సీఈలు

  • మరో సీఈ దీర్ఘకాలిక సెలవు..

హైదరాబాద్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పని ఒత్తిడి... నిరంతర సమీక్షలు వెరసి నీటిపారుదల శాఖ అధికారులు స్వచ్ఛంద పదవీ విరమణ బాట పడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులో పనిచేస్తున్న ఒక సీఈతో పాటు హైదరాబాద్‌లో పనిచేస్తున్న మరో సీఈ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరిద్దరికి కూడా ఆరేళ్ల సర్వీసు ఉంది. అలాగు ఒక కీలక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా... సంబంధిత సీఈ వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవు పెట్టుకున్నారు. ఇక మళ్లీ విధులకు రాననే సంకేతాలు ఇస్తూ ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో నీటిపారుదల శాఖ అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో విజిలెన్స్‌ విచారణను ఎదుర్కొంటుండగా... మరోవైపు ఆ ప్రాజెక్టుకు చెందిన వివిధ కాంపోనెంట్లలో పనిచేసిన వారిపై కూడా విజిలెన్స్‌ విచారణలు జరుగుతున్నాయి.


ఇదే సమయంలో గడిచిన పదేళ్లలో లేని విధంగా భారీగా పదోన్నతులు కూడా అందాయి. అయితే కీలక పోస్టులు ఖాళీగా ఉండటం... వారంలో రెండు రోజులు సమీక్షలకు హాజరుకావడం వంటి కారణాలతో అధికారులపై ఒత్తిడి పెరిగింది. ఒక సమీక్ష అయిపోగానే... మరో సమీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి. ఇటీవలే ఒక ఈఎన్‌సీ(అడ్మిన్‌), ఒక చీఫ్‌ ఇంజనీర్‌, మరో డిప్యూటీ ఈఎన్‌సీ పదవీ విరమణ చేశారు. వారిలో ఒకరికి మరో రెండు నెలలు అవకాశం ఉండగానే విధుల నుంచి రిలీవ్‌ కాగా... మరొకరు పదవీ విరమణ వయసు పెంచుతామని సంకేతాలిచ్చినా తిరస్కరించి, పదవీ విరమణకే మొగ్గు చూపారు. ఇక స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న ఇద్దరి సామర్థ్యాలపై అనుమానాలు ఉన్నాయి. విధి నిర్వహణలో ఏ రోజు ప్రభావవంతంగా పనిచేయలేదనే విమర్శలున్నాయి. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన మరో సీఈ పరిస్థితీ ఇంతేనని చెబుతున్నారు. సామర్థ్యం లేనివారు అందలం ఎక్కడమే దీనికి కారణమనే విమర్శలు కూడా వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇంటర్‌కు ఇక సెలవు!

₹40 వేల కోట్లకు టోకెన్లు

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 05:56 AM