Share News

పరిశ్రమల అనుమతుల్లో జాప్యానికి చెక్‌

ABN , Publish Date - Nov 03 , 2026 | 06:09 AM

పారిశ్రామిక అనుమతులకు ఉద్దేశించిన టీజీ ఐపాస్‌ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తును తిరస్కరిస్తే మరోమారు పరిశీలనకు ఆటో అప్పీల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

పరిశ్రమల అనుమతుల్లో జాప్యానికి చెక్‌
TG-iPASS

  • టీజీఐపాస్‌ నిబంధనల్లో కీలక సవరణలు

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక అనుమతులకు ఉద్దేశించిన టీజీ ఐపాస్‌ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఆన్‌లైన్లో దరఖాస్తును తిరస్కరిస్తే మరోమారు పరిశీలనకు ఆటో అప్పీల్‌ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) పెంపొందించడం, నియంత్రణపరమైన భారాన్ని తగ్గించడం, అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయడం, పారిశ్రామికవృద్థి, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా ప్రవేశపెట్టిన రూల్‌ 9ఏ ప్రకారం.. టీజీ ఐపాస్‌ కింద నోటిఫై చేసిన సేవకు సమర్పించిన దరఖాస్తును సంబంధిత అధికారి (డిజిగ్నేటెడ్‌ ఆఫీసర్‌) తిరస్కరిస్తే, దరఖాస్తుదారుడి తరఫున పై అధికారికి (కాంపిటెంట్‌ అథారిటీ)


ఎలకా్ట్రనిక్‌ సర్వీస్‌ డెలివరీ వ్యవస్థ ద్వారా ఆటోమేటిక్‌గా అప్పీల్‌ నమోదవుతుంది. ఈ అప్పీల్‌ ఒక్కసారి మాత్రమే జనరేట్‌ అవుతుంది. దరఖాస్తు తిరస్కరించిన మరుసటి రోజును ఆటో అప్పీల్‌ దాఖలు చేసిన తేదీగా పరిగణిస్తారు. ఈ మేరకు అప్పీల్‌ నమోదైన సమాచారాన్ని ఎలకా్ట్రనిక్‌ విధానంలో పై అధికారికి పంపిస్తారు. ఆటో అప్పీల్‌ వ్యవస్థ పనితీరును పర్యవేక్షించేందుకు ఎలకా్ట్రనిక్‌ డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రతి శాఖవారీగా నమోదైన మొత్తం ఆటో అప్పీళ్లు, పరిష్కరించిన వాటి సంఖ్య, అందుకు పట్టిన సగటు సమయం (రోజుల్లో) వివరాలను పొందుపరుస్తారు. తద్వారా అప్పీళ్ల పరిష్కారంలో శాఖల పనితీరును పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ మెట్రోకు రూ.275 కోట్లు

ట్రూ-అప్‌ భారం ప్రజలపైనే..

నేడు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 06:09 AM