Share News

విద్యార్థులకు బిగ్‌అలర్ట్.. ఇంటర్‌ ఫలితాలపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 07:22 PM

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు.

విద్యార్థులకు బిగ్‌అలర్ట్.. ఇంటర్‌ ఫలితాలపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు..
Telangana Inter Results 2026

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. తాజాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని తెలంగాణ విద్యాశాఖ ఖండించింది. ఈ ప్రచారం అసత్యం, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇంటర్ ఫలితాలు ప్రకటన నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే విడుదలవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలో ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ కాలేదన్న విషయం గుర్తు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ‘ఫ్యాక్ట్‌చెక్’ విభాగం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేధికగా ఒక పోస్ట్ పెట్టింది.


గతంలో ఇంటర్ ఫలితాలు విడుదలైన తేదీలు.. 2014 – మే 3, 2015 – ఏప్రిల్ 22, 2016 – ఏప్రిల్ 22, 2017 – ఏప్రిల్ 16, 2018 – ఏప్రిల్ 13, 2019 – ఏప్రిల్ 18, 2020 – జూన్ 18 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది), 2021 – జూన్ 28 (కోవిడ్ కారణంగా అందరినీ పాస్ చేయటం జరిగింది), 2022 – జూన్ 28, 2023 – మే 9, 2024 – ఏప్రిల్ 24, 2025 – ఏప్రిల్ 22 ప్రకటించారు’ అని పోస్ట్ చేశారు.


ఇక జవాబు పత్రాల మూల్యాంకనం, ఇతర అంశాలను బట్టి ఫలితాల విడుదల అయ్యే తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయి. అదే విధంగా, ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. మూల్యాంకన సమయాన్ని బట్టి, ఫలితాల విడుదల ప్రకటన చేస్తారు. ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా విద్యాశాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరుతున్నాము. సామాజిక మాధ్యమాలలో ప్రచారమయ్యే తప్పుడు వార్తలను నమ్మ వద్దని తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం

జగన్‌ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు

రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 07:24 PM