పాఠశాలలకు అనుమతులు ఎలా..?
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:54 AM
ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై అధికారుల కసరత్తు కొనసాగుతోంది.
అభిప్రాయ సేకరణ కోరనున్న విద్యాశాఖ
హైదరాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంపై అధికారుల కసరత్తు కొనసాగుతోంది. విలీన నిర్ణయంతో పాఠశాలలు హైస్కూల్ విధానం నుంచి హైయర్ సెకండరీ స్కూల్ విధానంలోకి మారనున్నాయి. దీనిపై పాఠశాల విద్య, ఇంటర్ విద్య ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలకు అనుమతులకు సంబంధించిన అంశంపై చర్చ నడుస్తోంది.
9 నుంచి 12 వరకు తరగతులు నిర్వహించే అవకాశం ఇవ్వాలని జూనియర్ కాలేజీలు కోరుతుండగా, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) మాత్రం అలా ఇవ్వొద్దంటోంది. అనుమతులు ఇస్తే 1 నుంచి 12 వరకు ఇవ్వాలంటోంది. ఈ అంశంపై గురువారం ఇంటర్ బోర్డు కార్యదర్శి సమక్షంలో జరిగిన సమావేశంలో చర్చించారు. పాఠశాలలకు అనుమతులు, రూపొందించాల్సిన నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇదే అంశంపై వచ్చే వారం పాఠశాల విద్య, ఇంటర్ విద్య వెబ్‌సైట్‌ల ద్వారా విద్యావేత్తలు, నిపుణులు, ప్రజల అభిప్రాయాలు సేకరించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.
ఇవి కూడా చదవండి...
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
నాపై ఆరోపణలు చేసేవారు చట్టాన్ని ఎదుర్కోవాల్సిందే: వీసీ సజ్జనార్
Read latest Telangana News And Telugu NEws