Share News

ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం: పొంగులేటి

ABN , Publish Date - Jul 23 , 2026 | 08:17 PM

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు విక్రయిస్తున్నారన్న ప్రచారంలో అవాస్తవం లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ విష ప్రచారం: పొంగులేటి
TG Minister Ponguleti Srinivas Reddy

హైదరాబాద్, జులై 23: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు విక్రయిస్తున్నారన్న ప్రచారంలో అవాస్తవం లేదని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్‌పై బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పేదల జీవితాలతో రాజకీయాలు చేయొద్దంటూ ఆ పార్టీ నేతలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. గురువారం తెలంగాణ సచివాలయంలో గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదలకు ఇళ్లు కడితే బీఆర్ఎస్‌ పార్టీకి ఎందుకంత అభ్యంతరం? అని ప్రశ్నించారు. పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని స్పష్టం చేశారు.


రూ. 40 నుంచి రూ. 60 లక్షల విలువైన ఫ్లాట్‌కు.. లబ్ధిదారుడి వాటా కేవలం రూ. 6 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల సబ్సిడీ అందిస్తోందని వివరించారు. ఇళ్ల కేటాయింపులో 50 శాతం రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. రిజర్వేషన్లలో మహిళలకు 30 శాతం కేటాయిస్తామని అన్నారు. ఎస్సీ 14 శాతం, ఎస్టీ 5 శాతం, బీసీ 16 శాతం, దివ్యాంగులు 5 శాతం, అవుట్‌సోర్సింగ్/4వ తరగతి ఉద్యోగులు/పారిశుధ్య కార్మికులకు 10 శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇళ్ల కోసం మీ సేవ, వాట్సాప్, వెబ్‌సైట్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వాట్సాప్ నంబర్.. 8096958096 ను సంప్రదించాలని మంత్రి పొంగులేటి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టులో ఎమ్మెల్సీ అనంత బాబుకు మరో ఎదురు దెబ్బ
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి

ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 08:26 PM