ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:04 PM
ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావు వెల్లడించారు. 16 రోజులు వివిధ సంఘాలతో చర్చించామని ఆయన వివరించారు.
హైదరాబాద్, జులై 23: ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావు వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. 16 రోజులు వివిధ సంఘాలతో చర్చించామని వివరించారు. ఉద్యమకారులను ఎలా ఎంపిక చేయాలి? ఎలా గౌరవించాలి అనే దానిపై అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాయని తెలిపారు. సంఘాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వానికి నివేదిస్తామని స్పష్టం చేశారు.
ఈ చర్చలకు 13 వేల మంది హాజరయ్యారని వివరించారు. దాదాపు వెయ్యి మంది సూచనలు చేశారని చెప్పారు. అయితే ఈ సమావేశాలు ముగియలేదని అన్నారు. వీటిపై ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు కూడా తీసుకుంటామని తెలిపారు. అందుకు సంబంధించిన తేదీలు ప్రకటించి.. ఉద్యమకారులు, సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కేలా ఈ కమిటీ పని చేస్తుందని చైర్మన్ కేశవరావు వివరించారు.
త్వరలో వివిధ జిల్లాల్లో పర్యటించి.. ఉద్యమకారులు, సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను గౌరవిస్తామని తెలిపారు. ఆయనను కూడా ఈ చర్చలకు ఆహ్వానిస్తామని చెప్పారు. అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్‌లోపే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ దయాకర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రూ. లక్ష కోట్లు ముంచిన కేసీఆర్‌ను కాపాడుతున్న సీఎం రేవంత్: నిజామాబాద్ ఎంపీ
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
For More TG News And Telugu News