Share News

యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:30 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు.

యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
Central Minister K Kishan Reddy

న్యూఢిల్లీ, జులై 23: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌తోపాటు రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంఘటనలు రాజకీయ ప్రేరేపితమైనవని అభివర్ణించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. గతంలో షాహిన్‌బాగ్‌లో ఆందోళనలు చేసిన నిరసనకారులు దీని వెనుక ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిని అరెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం జైలులో పెట్టిందని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగ వద్దని మరోసారి నీట్ పరీక్షను నిర్వహించామని వివరించారు. పేపర్ లీక్‌పై 2024 చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


జంతర్ మంతర్‌లో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలు పట్టుకుని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చాలని చూస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పేపర్లు లీక్ అయినప్పుడు కాంగ్రెస్‌‌లోని నేతలు ఏ రోజైన రాజీనామా చేశారా? అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. యూపీఏ హయాంలో ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయనే విషయాన్ని గుర్తు ఉంచుకోవాలని ఆ పార్టీ నేతలకు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా సూచించారు.


కేంద్రాన్ని ప్రశ్నించే హక్కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఉందా? అని బల్లగుద్దీ ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఫాస్ట్ ట్రాక్ ద్వారా చట్టాన్ని మరింత కఠినం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదో తరగతి పేపర్ లీక్ అయిందని అన్నారు.


మరి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా ఎందుకు చేయలేదని ఆ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించే సత్తా మీకు ఎక్కడిదంటూ తెలంగాణలోని అధికార పార్టీ నేతల తీరును ఆయన ఎండగట్టారు. విద్యార్థులపై ప్రేమ లేదంటూ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రూ. లక్ష కోట్లు ముంచిన కేసీఆర్‌ను కాపాడుతున్న సీఎం రేవంత్: నిజామాబాద్ ఎంపీ

ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 07:23 PM