విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ పెంపు
ABN , Publish Date - Oct 31 , 2026 | 06:01 AM
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి పండుగకు ముందే శుభవార్త చెప్పింది. వీరికి డీఏను (కరువుభత్యం) 2.543 శాతం పెంచింది.
19.272 నుంచి 21.815 శాతానికి పెంపుదల
జూలై 1 నుంచి వర్తింపు
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం దీపావళి పండుగకు ముందే శుభవార్త చెప్పింది. వీరికి డీఏను (కరువుభత్యం) 2.543 శాతం పెంచింది. దీంతో ప్రస్తుతం 19.272 శాతంగా ఉన్న డీఏ తాజా పెంపుదలతో 21.815 శాతానికి చేరింది. ఈ పెంపు జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల పరిధిలోని 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు రూ.14.63 కోట్ల వ్యయం కానుంది. విద్యుత్ సంస్థల సిబ్బంది ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగానే డీఏ పెంచాలని ఆదేశాలు ఇచ్చినట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్యారంటీ లేకుండానే రైస్ మిల్లు ఆస్తుల బదిలీ
క్యాన్సర్ కేసుల లెక్కలు ఇకపై పక్కాగా..
బీఆర్‌ఎస్ కాపాడిన భూమిని.. రేవంత్ అమ్ముకుంటామనడం సిగ్గుచేటు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News