Share News

అండాలసేకరణ అక్రమ దందాపై ఉక్కుపాదం!

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:54 AM

అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమ దందాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.

అండాలసేకరణ అక్రమ దందాపై ఉక్కుపాదం!
Illegal Egg Retrieval Racket

  • 27 ఏఆర్టీ కేంద్రాల్లో తనిఖీలు

  • 7 ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అండాల సేకరణ ముసుగులో జరుగుతున్న అక్రమ దందాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్‌ కేంద్రా ల్లో తనిఖీలు చేపట్టాయి. రాష్ట్రంలో గుర్తించిన మొత్తం 44 ఏఆర్టీ (అసిస్టెడ్‌ రీ ప్రొడక్టివ్‌ టెక్నాలజీ) కేంద్రాలకు గాను ఇప్పటివరకు 27 కేంద్రాల్లో వైద్య అధికారులు తనిఖీలు పూర్తి చేశారు. ఇందులో ఏడు ఆస్పత్రుల్లో 13 నిబంధనల ఉల్లంఘనలను గుర్తించిన అధికారులు ఆయా ఆస్పత్రులకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. మిగిలిన కేంద్రా ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసుల స్వాధీనంలో ఉన్న రికార్డులు, జాతీయ ఏఆర్టీ అండ్‌ సరోగసీ రిజిస్ట్రీ నుంచి అందే వివరాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలువురు మహిళలను గుర్తించగా.. వైద్యులు, ఐవీఎఫ్‌ కేంద్రాలు, మధ్యవర్తుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.


కాగా, ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా న్యూఢిల్లీలోని నేషనల్‌ ఏఆర్టీ అండ్‌ సరోగసీ రిజిస్ట్రీని ఈనెల 6న వెళ్లిన రాష్ట్ర అధికారులు.. తెలంగాణలో నమోదైన ఏఆర్టీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంకుల వివరాలను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని అందజేస్తామని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ అధికారులు కూడా హామీ ఇచ్చారు. కాగా, అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ (ఏఆర్టీ)చట్ట-2021కి విరుద్థంగా మహిళల నుంచి అండాలను సేకరించడం నేరమని వైద్యశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ఏఆర్టీ క్లినిక్‌లు, ఏఆర్టీ బ్యాంకులకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి అని, నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. ఆర్థిక ప్రలోభాలకు లోనై అక్రమ వైద్య విధానాలకు మహిళలు బలికావద్దని సూచించింది. మహిళల అక్రమ అండాల సేకరణ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లోని 20కి ఫైగా ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:54 AM