లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Sep 07 , 2026 | 05:47 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవద్దని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 07: ఇవాళ(సోమవారం) ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల టీషర్టులు ధరించి శాసన సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అసెంబ్లీ గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక తమపైన అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. హోంశాఖ జీపీకి నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీకి వెళ్ళే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేది స్పీకరేనన్న ధర్మాసనం స్పష్టం చేసింది. శాసనసభ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవద్దన్న పేర్కొంది. అలానే మహిళా శాసన సభ్యులపై దాడి చేసిన పోలీసులను గుర్తించాలని హోం శాఖకు హైకోర్టు తెలిపింది. దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఘటనపై కోర్టుకు నివేదిక ఇవ్వాలని డీజీపీకి తెలిపింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.
ఇవి కూడ చదవండి:
తాత మధు వ్యాఖ్యలు బాధాకరం : స్పీకర్ గడ్డం ప్రసాద్
ఉద్యోగాల పేరుతో మోసం.. పోలీసుల అదుపులో యూట్యూబర్ నందన