Share News

భార్యను చంపి, తలను ఫ్రిడ్జ్‌లో దాచిన భర్త..

ABN , Publish Date - Sep 07 , 2026 | 01:36 PM

అస్సాంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. భార్య శవం నుంచి తలను వేరు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. పెళ్లైన కొన్ని నెలల్లోనే ఆ భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

భార్యను చంపి, తలను ఫ్రిడ్జ్‌లో దాచిన భర్త..
Man assasinated Wife

ఇంటర్‌నెట్ డెస్క్: అస్సాంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. భార్య శవం నుంచి తలను వేరు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. పెళ్లైన కొన్ని నెలల్లోనే ఆ భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గువహటికి చెందిన రియా తాలుక్‌దర్ అనే యువతికి కొన్ని నెలల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో పెళ్లయింది. ఏమైందో ఏమో తెలీదు కానీ, వారం రోజుల క్రితం రియాను ఆమె భర్త చంపేశాడు. తర్వాత శవాన్ని ముక్కలుగా కోశాడు. తలను ఫ్రిడ్జ్‌లో దాచి ఇంటినుంచి పరారయ్యాడు.


ఇంటి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో సెప్టెంబర్ 6వ తేదీన పొరిగిళ్ల వారు పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి లోపల రియా శరీర భాగాలను గుర్తించారు. వాటిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రియా భర్త కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు అతడిని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఫేక్ వీడియో షేర్ చేయడంపై వివరణ ఇచ్చిన అభిజిత్ దీప్కే

‘సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Sep 07 , 2026 | 01:51 PM